హిందూ స్మశాన వాటిక లను అభివృద్ధి చేస్తాం_బైరెడ్డి



హిందూ స్మశాన వాటికలను అభివృద్ధి చేద్దాం 

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

నంద్యాల ప్రతినిధి సెప్టెంబర్ 29 ( రిపబ్లిక్ న్యూస్):
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఎంపీ బైరెడ్డి శబరి సహకారంతో నంద్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో హిందూ స్మశాన వాటికలను మొదటి విడతలో అభివృద్ధి చేసుకుందామని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు 

ఆదివారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో  ఆళ్లగడ్డ జనసేన అధికార ప్రతినిధి ఇరిగెల  సూర్యనారాయణరెడ్డి తదితరులతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమావేశం అయ్యారు.

ఈ సందర్బంగా మొదటి విడత హిందూ స్మశాన వాటికలు, రెండవ విడతలో ముస్లిం, క్రిస్టియన్ తదితరుల స్మశాన వాటికలని బాగుచేసుకుందామని, అవసరమైన గ్రామాల్లో ప్రతిపాదనలు తయారు చేసి ఎంపీ బైరెడ్డి శబరి ద్వారా అధికారులకు అందించాలని ఆయన కోరారు. 

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో  టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, ఉమ్మడి ప్రభుత్వంలో పేదలకు న్యాయం చేద్దాం అన్నారు. సిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ తదితర మండలాల్లో పలు సమస్యల పరిస్కారం కోసం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో ఇరిగెల  సూర్యనారాయణ రెడ్డి సమాలోచనలు చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు న్యాయవాది రెడ్డి గారి అమిర్ బాషా, రుద్రవరం జనసేన మండల కన్వీనర్ లింగామయ్యగౌడు, నాయకులు పి. చాంద్ బాషా, పెద్ద బాలయ్య, ఇబ్రహీంఖాన్, కొప్పర్ల బాషా, నాగరాజు శెట్టి, తేజనాధ్ తదితరులు ఉన్నారు.IMG-20240929-WA0015

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి