రెడీమేడ్ దుకాణదారులకు హెల్త్ కార్డుల పంపిణీ
రెడీమేడ్ దుకాణదారులకు హెల్త్ కార్డులు పంపిణీ
నంద్యాల నవంబర్ 3 (రిపబ్లిక్ న్యూస్):
పట్టణంలోని పద్మావతి నగర్ నందలి పిఏవిగ్రూప్ స్టీల్ దుకాణం నందు ఆదివారం నంద్యాల రెడీమేడ్ మర్చంట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పబ్బతి వేణుగోపాల్ ,అధ్యక్షుడు గద్వాల నరసింహ రాజులు హెల్త్ కార్డులను ఆవిష్కరించారు .అనంతరం రెడీమేడ్ దుకాణం యజమానులకు హెల్త్ కార్డులను గౌరవాధ్యక్షుడు పబ్బతి వేణుగోపాల్ పంపిణీ చేశారు. నంద్యాల రెడీమేడ్ అసోసియేషన్ కార్యాలయం సంవత్సరం కాలం పాటు మెయింటెన్స్ కొరకు 60 వేల రూపాయల నగదును ట్రెజరర్ కి పబ్బతి వేణుగోపాల్ అందజేశారు. ఈ సందర్భంగా గద్వాల నరసింహ రాజు మాట్లాడుతూ అనారోగ్య పరిస్థితులలో ఈ హెల్త్ కార్డును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. రెడీమేడ్ దుకాణదారుల కోసం గౌరవ అధ్యక్షులు పబ్బతి వేణుగోపాల్ ,సెవెన్ హిల్స్ హాస్పిటల్స్ అధినేత మారుతి, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల సహకారంతో హెల్త్ కార్డులను అందించగలిగామని సహాయ సహకారాల అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గౌరవాధ్యక్షులు పబ్బతి వేణుగోపాల్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో రెడీమేడ్ దుకాణదారులు కలిసికట్టుగా ఉండి ఐక్యతతో వారి అభివృద్ధికి, ఆరోగ్యానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటేష్, అసోసియేషన్ కమిటీ లీడర్ రాఘవేంద్ర, కమిటీ మెంబర్లు విజయ్ కుమార్ ,మహేష్, రిచ్ బై దుకాణం యజమాని సుబ్రహ్మణ్యం, బ్యాచిలర్స్ దుకాణ యజమాని మల్లి, శ్రీకృష్ణ డ్రెస్సెస్ యజమాని కృష్ణ ,ప్రణీత డ్రెస్సెస్ యజమాని మోహన్ పాల్గొన్నారు