భారీ వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష

IMG-20241014-WA0009

*అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక*

*భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్*

*భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై  సమీక్షించిన సిఎం*

*రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదు*

*18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదు*

*టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి సూచనలు, ఆదేశాలు:-*
•    రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది
•    చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి...పర్యవేక్షణ ఉంచాలి.
•    అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలి
•    ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్ లు పంపి అలెర్ట్ చేయాలి
•    చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టాలి
•    వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
•    రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలి
•    అప్రమత్తతో ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయాలి
•    కంట్రోల్ రూంల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలి
•    సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలి
•    ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కరుస్తాయని తెలిపిన అధికారులు 
•    ప్రస్తుతం నెల్లూరులో 30 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యిందని వివరించిన అధికారులు...రేపటి నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపిన అధికారులు
•    నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ సిద్దంగా పెట్టినట్లు తెలిపిన అధికారులు

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి