ఏ వి ఆర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
*రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ అన్నం సుబ్బయ్య మృతి*
*వ్యవ*సాయం*లో...*
*అన్నం సుబ్బయ్య సేవలు చిరస్మరణీయం*
*35 సంవత్సరాలు రైతులతో అనుబంధం*
*బలిజ సంఘం ప్రముఖుడిగా విశిష్ట సేవలు*
*నంద్యాల అక్టోబర్5(*రిపబ్లిక్ న్యూస్):
*నంద్యాల కు చెందిన రిటైర్డ్ వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అన్నం సుబ్బయ్య (82) శనివారం ఉదయం మృతి చెందారు. అన్నం సుబ్బయ్యకు ఇద్దరు కుమారులు. ఒకరు ఏవిఆర్ ప్రసాద్. ఈయన లయన్స్ క్లబ్ సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రాజకీయాల్లో ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. మరొకరు ఏ.లీలా రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డారు. ఒక కుమార్తె జి. పద్మజ ఉన్నారు. వ్యవసాయ శాఖలో ఏవోగా, ఏడిఏ గా, డిప్యూటీ డైరెక్టర్ గా అన్నం సుబ్బయ్య విశిష్ట సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లా కేంద్రమైన కర్నూలులో ఏపీ విత్తన ధ్రువీకరణ విభాగంలో అధికారిగా పనిచేశారు. వ్యవసాయ శాఖలో వివిధ హోదాల్లో పని చేసిన అన్నం సుబ్బయ్య నంద్యాల, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం లోని వివిధ మండలాల పరిధిలో ఉన్న గ్రామాల్లోని రైతులతో మమేకమై తనకంటూ ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని కొనసాగించి లాభసాటి వ్యవసాయంలో మెలకువలను, సలహాలు సూచనలను రైతులకు క్షేత్రస్థాయిలో అందించారు. 1966 నుంచి 35 సంవత్సరాలు వ్యవసాయ శాఖలో వివాద రహితుడిగా, అత్యంత సౌమ్యుడిగా, రైతులతో మమేకమై వివిధ హోదాల్లో పనిచేసిన అన్నం సుబ్బయ్య 2000 సంవత్సరంలో పదవీ విరమణ చేయడం జరిగింది. పదవీ విరమణ చేసినప్పటికీ తనతో ఎంతో అనుబంధంగా ఉన్న రైతులతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తూ వ్యవసాయంలో చేయూతను అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. వ్యవసాయ శాఖలో వివిధ హోదాల్లో పని చేసి వందలాది మంది రైతుల ఆదరాభిమానాలు,ఆప్యాయతలు పొందిన అన్నం సుబ్బయ్య ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలిజ సామాజిక వర్గం అభ్యున్నతికి కూడా విశిష్ట సేవలు అందించారు. శనివారం అన్నం సుబ్బయ్య మృతదేహాన్ని సందర్శించి మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ తనయుడు ఫిరోజ్ నివాళులర్పించారు అనంతరం ఏవీఆర్ ప్రసాద్ ను పరామర్శించారు. బంజర సంఘం నాయకులు డాక్టర్ జి రవికృష్ణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు