బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు నిధులు

అమరావతి

ఇవాళ్టీ నుంచి బడ్జెట్ సమావేశాలు.

సమావేశాల తొలి రోజునే బడ్జెట్ పెట్టనున్న ప్రభుత్వం.

తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

ఉదయం 10గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్.

మంత్రి పయ్యావులకు బడ్జెట్ పత్రాలు అందచేసిన ఆర్థికశాఖ అధికారులు.

మంత్రికి బడ్జెట్ పత్రాలు అందించిన పీయూష్ కుమార్, జానకీ, నివాస్.

బడ్జెట్ పత్రాలకు పూజలు నిర్వహించిన కేశవ్.

బడ్జెట్ పత్రాలతో సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన పయ్యావుల.

అర్థరాత్రి వరకు బడ్జెట్టుపై తుది కసరత్తు చేసిన పయ్యావుల.

ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీదే పాలన చేసిన కూటమి సర్కార్.

ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చెమటోడుస్తోన్న చంద్రబాబు టీమ్.

ఫైనాన్షియల్ టఫ్ టైంలో ఆర్థిక మంత్రిగా పయ్యావుల బాధ్యతలు.

సంక్షేమం, అభివృద్ధి రెండు రంగాలకూ బడ్జెట్టులో సమ ప్రాధాన్యత ఉండేలా కసరత్తు.

అమల్లోకి వచ్చిన సూపర్ సిక్స్ హామీలకు నిధుల కేటాయింపు.

పెన్షన్లు, దీపం-2.0, అన్న క్యాంటీన్ల పథకాలకు నిధుల కేటాయింపు.

ఇరిగేషన్, రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణానికి నిధుల కేటాయింపుపై బడ్జెట్టులో ఫోకస్.

పోలవరం, రాజధాని పనుల పునః ప్రారంభానికి నిధుల లేమి లేకుండా బడ్జెట్లో ఏర్పాట్లు.

కేంద్రం నుంచి వచ్చే నిధులను అనుసంధానించి బడ్జెట్ రూపకల్పన చేపట్టడంపై ప్రత్యేక శ్రద్ధ.

పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌళిక సదుపాయాలకు నిధుల కల్పన.

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల కేటాయింపుపై పయ్యావుల ఫోకస్.

నరేగా కింద చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక దృష్టి.

ప్రభుత్వం తెచ్చిన వివిధ పాలసీలకు అనుగుణంగా అవసరమైన మేరకు నిధుల సర్దుబాటుపై పయ్యావుల కసరత్తు.

పెండింగులో ఉన్న ఫీజు రీ-ఇంబర్సుమెంట్, ఆరోగ్య శ్రీ నిధుల చెల్లింపులపై ఫోకస్ పెట్టిన పయ్యావుల.

Tags:

Related Posts

Advertisement