లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ

నేరాల కట్టడికి , నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహాకరించాలి

లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ

నంద్యాల టౌన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి

IMG-20241122-WA0001

నంద్యాల క్రైం, నవంబర్ 22, (రిపబ్లిక్ న్యూస్): రామక్రిష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు టౌన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ల అధ్వర్యంలో పట్టణంలోని లాడ్జి యాజమాన్యాలతో శుక్రవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా డిఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో బాగంగా లాడ్జిలపై నిఘా ఉంచాలని, పట్టణ పోలీసుల పనితీరు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా లాడ్జిల యందు తప్పనిసరిగా సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎక్కువ రోజులు ఎవరు ఉంటున్నారు అటువంటి వారిపై నిఘా ఉంచి వారి వివరాలు పోలీసులకు అందించాలి. లాడ్జికి వచ్చిన వారి నుండి ఆదార్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి వారి చిరునామాతోకూడిన పూర్తి వవరాలు తీసుకోవాలి. పట్టణంలో భవన నిర్మాణాల కొరకు చాలా మంది వివిద రాష్ట్రాల నుండి అనగా బిహార్,పచ్చిమ బెంగాల్,ఒరిస్సా,ఉత్తర ప్రదేశ్ మొదలగు ప్రాంతాల నుండి పని చేసుకొనుటకు కొత్త వారు రావడం జరుగుతుంది.అటువంటి వారిపై నిఘా ఉంచాలి. లాడ్జిలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగకుండా లాడ్జి యజమానులు తగిన చర్యలు తీసుకోవాలి.ఏదైనా అనుమానం ఉంటే తప్పనిసరిగా సంబందిత పోలీసు అదికారులకు సమాచారం అందించాలి. లాడ్జి యజమానులు తప్పనిసరిగా ప్రతి 24 గంటకు ఒకసారి ఎంతమంది కొత్త వ్యక్తులు వచ్చారు అనే విషయం సంబందిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలి. రోజూ రోజూకూ నేరాలు పెరిగి పోతున్నాయని ప్రతి ఒక్కరూ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు, ముఖ్యమైన అన్ని వ్యాపార సముదాయాల యందు షాపింగ్ మాల్స్, జ్యూవెలరీ, లాడ్జీల యందు మన్నిక కలిగిన సీసీ కెమెరాలు స్వచ్చంధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నేరాల కట్టడికి , నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహాకరించాలని తెలియజేశారు.

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి