గురు రాజా విద్యాసంస్థల రక్తదానం

IMG-20241001-WA0006
🩸🩸🩸🩸🩸🩸🩸🩸
*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ రక్తదాన దినోత్సవం*
*👉. గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ లో రక్తదాన శిబిరం.*
*👉. రక్తదానం చేసిన గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు*
**************************
     మంగళవారం జాతీయ రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ సహకారంతో, విజయ బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో  గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ విద్యార్థులు రక్తదానం చేశారు.
   ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు,మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మౌలాలి రెడ్డి, శ్రీ గురు రాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ షేక్షావల్ రెడ్డి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. 
     ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, మౌలాలిరెడ్డి మాట్లాడుతూ ప్రజలలో రక్తదానంపై ఉన్న ఆపోహలు తొలగించి తద్వారా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని కోరారు. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణం కాపాడడానికి మనకు గొప్ప అవకాశం దొరికినట్టుగా భావించాలని అన్నారు. ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలు, రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి, గుండె ,మెదడు వంటి పెద్ద ఆపరేషన్లు చేసే సమయంలో రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడుతుందని, ఆ పరిస్థితిలో సమయానికి రక్తం అందుబాటులో లేకపోతే ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుందని అన్నారు. యువత ముఖ్యంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 
       తదుపరి రక్తదానం చేసిన రక్త దాతలను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
      ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, కోశాధికారి మామిళ్ల నాగరాజు, సభ్యులు మేడం చంద్రశేఖర్, విజయ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి సద్దాం, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, అధిక సంఖ్యలో బ్యాంక్ కోచింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి