అటవీ శాఖ నోటీసులతో ఓంకార పుణ్యక్షేత్రంలో ఉద్రిక్తత
ఓంకారం పుణ్యక్షేత్రంకు
తరిలి వస్తున్న బండి ఆత్మకూరు మండల గ్రామ ప్రజలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓంకారం కు అటవీ శాఖ మహిళ అధికారిని రామేశ్వరి నోటీసులు ఇవ్వడంతో బండి ఆత్మకూరు మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండి ఆత్మకూరు మండల ప్రజలకు ఓంకారం పుణ్యక్షేత్రంతో ఎంతో పేరు ప్రసిద్ధులు ఉండడంతో మండలం చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాల నుండి ప్రజలు ఓంకారం క్షేత్రానికి చేరుతున్నట్లు సమాచారం .ప్రతి సంవత్సరం బండి ఆత్మకూరు మండలంలో ప్రతి రైతు తమ మొదటి పంటలో తమకు తోచినంత ధాన్యాన్ని ఓంకారం క్షేత్రంలోని అవినాభావ సంబంధం కలదు నిత్యాన్నదానంగా ప్రసిద్ధి చెందిన కాశిరెడ్డి నాయన ఆశ్రమం కు ఇవ్వటం రివాజుగా వస్తుంది. దీంతో ఓంకారం క్షేత్రం కు రైతులకు భక్తిశ్రద్ధలతో పాటు అవినాభావ సంబంధం కలదు.అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి తక్షణమే ఖాళీ చేయాలని హుకుం జారీ చేయడంతో భక్తులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మండల ప్రజలు క్షేత్రానికి చేరుకుంటుండడంతో ఆయా సంబంధిత అధికారులు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం .