రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
నంద్యాల క్రైం, నవంబర్ 22, (రిపబ్లిక్ న్యూస్): జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సంబంధిత పోలీసు అధికారులు వారి సిబ్బంది సహాయంతో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలపై అవగాహన కల్పించడం జరిగింది. సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. డిజిటల్ అరెస్టులు అనేవి లేవు. సైబర్ నేరగాళ్ల చేతిలో పడి మోసపోవద్దు. మీ వ్యక్తిగత సమాచారం అనగా ఓ.టీ.పీ పాస్వర్డ్ మొదలగునవి ఎవరితోనూ పంచుకోరాదు. తెలియని వ్యక్తుల నుండి వచ్చే మొబైల్ లింకులు క్లిక్ చేయవద్దు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మహిళలపై చిన్న పిల్లలపై జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఏదైనా అపాయం సంభవించినప్పుడు 100, 112 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసిన యెడల పోలీసు వారు రక్షణ కల్పించడం జరుగుతుంది. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. వాహన డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మీరు డ్రైవింగ్ చేసే వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఓవర్ లోడ్, ర్వాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం చెయ్యరాదు.