45 వేల కోట్ల అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన

45 వేల కోట్ల అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన

 

*మచిలీపట్నం, అక్టోబర్ 14: రిపబ్లిక్ న్యూస్IMG-20241014-WA0011

*పల్లె పండుగ -  పంచాయతీ వారోత్సవాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  కొణిదెల పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా కంకిపాడు గ్రామంలో లాంచనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయల వ్యయంతో 30 వేల పనులు, 8 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ వందరోజుల పని దినాలు, 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 25 వేల గోకులాల నిర్మాణం, 10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ కందకాలు తవ్వకం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఉపముఖ్యమంత్రి ఆవిష్కరించారు.*

*అలాగే కంకిపాడు గ్రామపంచాయతీలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 95.15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 11 అంతర్గత సిమెంటు రహదారులు రెండు మినీ గోకులాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.*

*పునాదిపాడు గ్రామపంచాయతీలో 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 2 అంతర్గత రహదారుల నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.*

*పునాదిపాడు గ్రామంలో 54 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సామాజిక ఆరోగ్య కేంద్రం  ప్రహరీ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.*

*ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్, సంచాలకులు కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్ రావు, పెనమలూరు, గుడివాడ, పామర్రు, పెడన శాసనసభ్యులు బోడె ప్రసాద్, వెనిగండ్ల రాము,  వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్ పలువురు జిల్లా అధికారులు,  కంకిపాడు ఎంపీపీ నెరసు రాజలక్ష్మి, సర్పంచు బాకి రమణ, పునాదిపాడు సర్పంచ్ ఎం.విజయకుమారి, బండి రామకృష్ణ తదితర అనధికారులు పాల్గొన్నారు.*
-

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి