క్రీడాకారులకు మహిళా వైద్యురాళ్ళ విరాళం

*జాతీయ స్థాయి క్రీడాకారులకు నంద్యాల మహిళా వైద్యుల ఆర్థిక సహకారం
నంద్యాల అక్టోబర్ 11 (రిపబ్లిక్ న్యూస్):
ఈనెల 14వ తేదీ నుండి గోవా రాష్ట్రంలోని వాస్కోడిగామా రవీంద్ర భవన్ లో నిర్వహించనున్న జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్  పోటీలలో పాల్గొంటున్న నంద్యాల పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులకు ఐఎంఏ నంద్యాల మహిళా వైద్యులు శుక్రవారం ఆర్థిక సహకారం అందజేశారు. 
       ఐఎంఏ నంద్యాల మిషన్ పింక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో, రాష్ట్ర మిషన్ పింక్ హెల్త్ కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, నంద్యాల మిషన్ పింక్ హెల్త్ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ నెరవాటి అరుణకుమారి ల నిర్వహణలో స్థానిక ఐఎంఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరపున పాల్గొంటున్న నంద్యాల క్రీడాకారులు పల్లవి, మహేష్ ,నరసింహ లకు పదివేల రూపాయల ఆర్థిక సహకారం అందించారు. 
     ఐఎంఏ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు,రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ వసుధ రాణి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ఐఎంఏ చేస్తున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు రాష్ట్రం తరఫున పాల్గొంటున్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ సహకారం అందజేశామన్నారు. డాక్టర్ లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపి పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని శుభాకాంక్షలు తెలిపారు. 
      ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మిషన్ పింక్ హెల్త్ కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, ఐఎంఏ నంద్యాల ఉపాధ్యక్షురాలు డాక్టర్ మాధవి, మిషన్ పింక్ హెల్త్ విభాగం గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ నాగమణి,అధ్యక్షురాలు డాక్టర్ అరుణకుమారి,మహిళా విభాగం గౌరవాధ్యక్షురాలు డాక్టర్ నర్మద , పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు పల్లవి ,మహేష్, నరసింహ పాల్గొన్నారు.IMG-20241011-WA0007

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి