భారత్ ఆస్ట్రేలియా ల చిరకాల బంధం-బైరెడ్డి శబరి
ఆస్ట్రేలియాలో బైరెడ్డి శబరి అద్భుత ప్రసంగం
నంద్యాల అక్టోబర్ 21 (రిపబ్లిక్ న్యూస్):
ఆస్ట్రేలియా మెలబోర్న్ విక్టోరియన్ పార్లమెంట్ నుదేశించి అద్భుతంగా, భారతీయుల మానవత్వం, సేవా గుణం, అగ్ర రాజ్యాలకు దీటుగా భారత్ ఆర్ధికంగా ఎదగడం , ప్రపంచ దేశాలతో భారతదేశం స్నేహం, ఆస్ట్రేలియా - భారతదేశం ఎగుమతులు, దిగుమతుల బలోపేతం, మనవాళి మనుగడకు భారత్ - ఆస్ట్రేలియా తీసుకోవాల్చిన సాంకేతిక, శాస్రియ, శక్తి, నైపుణ్యంను జోడించినప్పుడే భవిష్యత్ మానవాళి కి ప్రయోజనం ఉంటుందని, భారత్ - ఆస్ట్రేలియా బంధం బలోపేతం కోసం ఇరుదేశాలు ముందుండాలని, ఆస్ట్రేలియాలోని భారత సంతతికి చెందిన వైద్యులను ప్రోత్సహించించెందుకు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, స్వతహాగా ఇంటర్వేన్సన్ రేడియాలాజిస్ట్ డాక్టర్ అయిన నన్ను ఆస్ట్రేలియా మెల్ బోర్న్ విక్టోరియన్ పార్లమెంట్ ఉభయ సభ్యులనుద్దేసించి ప్రసంగించేందుకు అవకాశం కల్పించిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోల్ ఆల్పోనిస్ కు, భారతదేశ ప్రతినిధిగా ఇక్కడకు పంపిన మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఈ మంచి అవకాశం కల్పించిన మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.