ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
నంద్యాల నిర్వహణ టీవీటెక్నీషియన్ యూనియన్ సభ్యులు
ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అవసరం అయిన స్టీల్ ప్లేట్లు, స్టీల్ వాటర్ ట్యాంక్ అందించిన యూనియన్ భ్యులు
నంద్యాల నూనెపల్లె, నవంబర్ 21, (రిపబ్లిక్ న్యూస్): స్థానిక పోనపురం కాలనీ ఎం.పి.పి పాఠశాల నందు గురువారం ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అవసరం అయిన స్టీల్ ప్లేట్లు, స్టీల్ వాటర్ ట్యాంక్, యూనియన్ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధులుగా డాక్టర్.జి.రవికృష్ణ,ఎం.ఈ.ఓ బ్రహ్మం, రాంప్రసాద్ పాలుగోన్ని కార్యక్రమంని ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ కమ్యూనికేషన్ యొక్క కీలక మాధ్యమంగా టెలివిజన్ పాత్రను హైలైట్ చేయడానికి, ప్రపంచ అవగాహన, నిర్ణయం తీసుకోవడం, విద్యపై దాని ప్రభావాన్ని హైలైట్ చేయడానికి ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని ఏటా నవంబర్ 21 న జరుపుకుంటారు అన్నారు. అలాగే టీవీ ఎంత ముఖ్యమో టీవీని సరిచేయడానికి టెక్నీషియన్ కూడా అంటే ముఖ్యం అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన నంద్యాల టీవీ టెక్నీషియన్ యూనియన్ సభ్యులును అభినందించారు. మును ముందు యూనియన్ సభ్యులకు తమ ఐఎంఏ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సుమారు వంద మంది పిల్లలకు స్టీల్ ప్లేట్లు, స్టీల్ ట్యాంక్, స్టేషనరీ ముఖ్య అతిధులు చేతుల మీదుగా అందించారు. ఎం.ఈ.ఓ బ్రహ్మం మాట్లాడు తమ పాఠశాలకు సహాయం అందించిన యూనియన్ సభ్యులను అభినందించారు. ఎం.ఈ.ఓ రాంప్రసాద్ మాట్లాడుతు పిల్లలకు టీవీ ఎంత ముఖ్యమో విద్య కూడా అంతే ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జయపాల్, జిల్లా అధ్యక్షులు కన్నయ్య, కార్యదర్శి శివ యాదవ్, కోశాధికారి వీర రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.