మందు మత్తులో యాక్షన్ చేసిన బడాబాబులు
ఫ్లాష్.. ఫ్లాష్... ఫ్లాష్....
నంద్యాలలో మందుబాబుల మరోసారి వీరంగం..*
*నంద్యాల చామకాల్వ వైస్సార్ సర్కిల్ నందు మంగళవారం సాయంత్రం మద్యం మత్తులో కార్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో భారీ ఆక్సిడెంట్.. 10అడుగుల ఎత్తుకి ఎగిరిపడిన వృద్ధుడు.... ప్రాణాపాయ స్థితిలో వృద్ధుడు*
*స్థానిక చామకాల్వ వైస్సార్ సర్కిల్ వద్ద ఒక గుర్తు తెలియని కార్ లో కొంతమంది మద్యం సేవించిన యువకులు అతివేగంతో తెల్లటి కార్ నడపడంతో అటుగా వెళ్తున్న 65ఏళ్ళ వృద్ధుడిని గుద్దడంతో అయన 10 అడుగులు గాలిలో ఎగిరి క్రింద పడి తీవ్ర గాయలపాలయ్యడు.*
*ఈ మందుబాబులు కనీస మానవత్వం చూపించకుండా మరింత వేగంతో మున్సిపాలిటీ మీదుగా పద్మావతి నగర్ నుండి పారిపోయారు. సంఘటనను ప్రత్యేక్షముగా చూసిన ప్రజలు మరియు నంద్యాల 3వ పట్టణ బీట్ పోలీస్ కానిస్టేబుల్ వెంబడించిన వారు చిక్కకుండా పారిపోవడం జరిగింది.భారీ గాయలతో అర్థనాధలు చేస్తున్న ఆ వృద్ధుడిని స్థానికులు అంబులెన్సు పిలిపించి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.*
ఇప్పటివరకు 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేయలేడని తెలుస్తుంది, ఎందుకంటే ఆక్సిడెంట్ చేసింది బడాబాబుల పిల్లలని అనుమానం.