నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి ఆస్ట్రేలియా నుండి అరుదైన గౌరవం

 


* నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి మరో అరుదైన గౌరవం 


* ఆస్ట్రేలియా విక్టోరియన్ పార్లమెంట్ సమావేశాలకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఆహ్వానం 


ఆస్ట్రేలియా విక్టోరియన్  లెజిస్లేటివ్ సెషన్‌కు హాజరైన భారత పార్లమెంటు సభ్యులు , భారతీయ సంతతికి చెందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులను సత్కరించి, గౌరవించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించి నంద్యాల  పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరికి ఆహ్వానం పంపారు. 

ఆస్ట్రేలియా దేశం మెల్బోర్న్ - విక్టోరియా ప్రభుత్వ శాసన మండలి విప్, OAM MP లీ తర్లామిస్  భారతదేశంలోని నంద్యాల పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఆహ్వానం పంపారు.

డాక్టర్ బైరెడ్డి శబరి వారి ఆహ్వానాన్ని  అంగీకరించారు.   అక్టోబర్ 17-19 వరకు జరిగే విక్టోరియన్ పార్లమెంటు సమావేశానికి హాజరవుతానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి  శనివారం చెప్పారు , 

మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రసంగించగలనని, భారతదేశ సాంస్కృతిక,  ప్రభుత్వ సంబంధాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ప్రదానం చేస్తానని శబరి వివరించారు. 

అలాగే నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విక్టోరియా ప్రభుత్వం మద్దతుతో ఆస్ట్రేలియా నిర్వహించేIMG-20241012-WA0014 కార్యక్రమంలో గౌరవ అతిథిగా హాజరవుతారు. ఆస్ట్రేలియన్ కమ్యూనిటీకి విశిష్ట సేవలందిస్తున్న భారతీయ సంతతికి చెందిన వైద్యులు,  నర్సుల అసాధారణమైన సహకారాన్ని జరుపుకోవడం,  గుర్తించడం ఈ ఈవెంట్ లక్ష్యం.

ఈ గుర్తింపు ఆస్ట్రేలియాలో ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలో భారతీయ వారసత్వానికి చెందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు పోషిస్తున్న కీలక పాత్రను హైలైట్ చేస్తుందని, రెండు దేశాల మధ్య శాశ్వతమైన సంబంధాన్ని బలోపేతం చెబుతుందన్నారు.

నాకు ఈ అవకాశం కల్పించిన  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,  మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని,  నేను మన   దేశం, ఆంధ్ర రాష్ట్రం గర్వపడేలా పని చేస్తానని  నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి