విజయవాడలో శ్రీ రాజ రాజేశ్వరి దేవిగా దుర్గాదేవి దర్శనం
*నేడు ఇంద్రకీలాద్రిపై శ్రీ రాజరాజేశ్వరిగా దుర్గమ్మ దర్శనం.*
వియవాడ (అక్టోబరు 12 రిపబ్లిక్ న్యూస్)
నవరాత్రి ఉత్సవాలలో అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీ దేవి. సమస్త విశ్వానికీ ఆమె మహారాజ్ఞి. లోకపాలకులైన అష్ట దిక్పాలకులను పాలించేవారు త్రిమూర్తులు.
ఆ త్రిమూర్తులను పాలించే దేవతను రాజ రాజేశ్వరిగా పిలుస్తారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం.
రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’ గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా , జ్ఞాన , క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది.
అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత.
పొదుపు చెయ్యడం నేటితరం ఆలోచన
ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరకుగడ , ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనం ఇస్తుంది.
చెరకు రసం అత్మజ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టులను , దురహంకారులను , శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వు , చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి.
సమున్నతమైన దైవికశక్తికి ఈమె ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగిఉండటం , ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవాల్సిన స్ఫూర్తి. లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయాలి.
అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ , బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా , చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ శ్లోకం పఠించాలి.
నైవేద్యంగా సేమ్యా పాయసం , కొబ్బరి పాయసం , కొబ్బరన్నం , పరమాన్నం సమర్పిస్తారు..
*నవరాత్రి ఉత్సవాలలో అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీ దేవి.*
సమస్త విశ్వానికీ ఆమె మహారాజ్ఞి. లోకపాలకులైన అష్ట దిక్పాలకులను పాలించేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను పాలించే దేవతను రాజ రాజేశ్వరిగా పిలుస్తారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. *‘అపరాజితాదేవి’* గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా , జ్ఞాన , క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత.
పొదుపు చెయ్యడం నేటితరం ఆలోచన
ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరకుగడ , ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనం ఇస్తుంది. చెరకు రసం అత్మజ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టులను , దురహంకారులను , శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వు , చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి.
సమున్నతమైన దైవికశక్తికి ఈమె ప్రతీక.
చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగిఉండటం , ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవాల్సిన స్ఫూర్తి. లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. *అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ , బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా , చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ* శ్లోకం పఠించాలి. నైవేద్యంగా సేమ్యా పాయసం , కొబ్బరి పాయసం , కొబ్బరన్నం , పరమాన్నం సమర్పిస్తారు.
*రాజరాజేశ్వర్యష్టకం*
అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ౧
అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ
వాణీ పల్లవపాణి వేణుమురళీగానప్రియా లోలినీ
కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ౨
అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ
జాతీచంపకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా
వీణావేణువినోదమండితకరా వీరాసనేసంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ౩
అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ౪
అంబా శూల ధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమాసేవితా
మల్లద్యాసురమూకదైత్యమథనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ౫
అంబా సృష్టవినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతాసుతార్చితపదా ఉద్దండదైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ౬
అంబా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాదిపిపీలికాంతజననీ యా వై జగన్మోహినీ
యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళామాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ౭
అంబాపాలిత భక్తరాజదనిశం అంబాష్టకం యః పఠేత్
అంబాలోకకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతమ్
అంబా పావనమంత్రరాజపఠనాదంతే చ మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ౮
*శ్రీ రాజరాజేశ్వరీ అష్టోత్తరశతనామావళిః*
ఓం భువనేశ్వర్యై నమః |
ఓం రాజేశ్వర్యై నమః |
ఓం రాజరాజేశ్వర్యై నమః |
ఓం కామేశ్వర్యై నమః |
ఓం బాలాత్రిపురసుందర్యై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం కళ్యాణ్యై నమః |
ఓం సర్వసంక్షోభిణ్యై నమః |
ఓం సర్వలోకశరీరిణ్యై నమః |
ఓం సౌగంధికపరిమళాయై నమః | ౧౦
ఓం మంత్రిణే నమః |
ఓం మంత్రరూపిణ్యై నమః |
ఓం ప్రాకృత్యై నమః |
ఓం వికృత్యై నమః |
ఓం ఆదిత్యై నమః |
ఓం సౌభాగ్యవత్యై నమః |
ఓం పద్మావత్యై నమః |
ఓం భగవత్యై నమః |
ఓం శ్రీమత్యై నమః |
ఓం సత్యవత్యై నమః | ౨౦
ఓం ప్రియకృత్యై నమః |
ఓం మాయాయై నమః |
ఓం సర్వమంగళాయై నమః |
ఓం సర్వలోకమోహాధీశాన్యై నమః |
ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః |
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః |
ఓం పురాణాగమరూపిణ్యై నమః |
ఓం పంచప్రణవరూపిణ్యై నమః |
ఓం సర్వగ్రహరూపిణ్యై నమః |
ఓం రక్తగంధకస్తురీవిలేప్యై నమః | ౩౦
ఓం నాయికాయై నమః | (నానాయై నమః)
ఓం శరణ్యాయై నమః |
ఓం నిఖిలవిద్యేశ్వర్యై నమః |
ఓం జనేశ్వర్యై నమః |
ఓం భూతేశ్వర్యై నమః |
ఓం సర్వసాక్షిణ్యై నమః |
ఓం క్షేమకారిణ్యై నమః |
ఓం పుణ్యాయై నమః |
ఓం సర్వరక్షణ్యై నమః |
ఓం సకలధర్మిణ్యై నమః | ౪౦
ఓం విశ్వకర్మిణే నమః |
ఓం సురమునిదేవనుతాయై నమః |
ఓం సర్వలోకారాధ్యాయై నమః |
ఓం పద్మాసనాసీనాయై నమః |
ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః |
ఓం చతుర్భుజాయై నమః |
ఓం సర్వార్థసాధనాధీశాయై నమః |
ఓం పూర్వాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం పరమానందాయై నమః | ౫౦
ఓం కళాయై నమః |
ఓం అనంగాయై నమః |
ఓం వసుంధరాయై నమః |
ఓం శుభదాయై నమః |
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |
ఓం పీతాంబరధరాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం భక్తవత్సలాయై నమః |
ఓం పాదపద్మాయై నమః |
ఓం జగత్కారిణై నమః | ౬౦
ఓం అవ్యయాయై నమః |
ఓం లీలామానుషవిగ్రహాయై నమః |
ఓం సర్వమాయాయై నమః |
ఓం మృత్యుంజయాయై నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః |
ఓం పవిత్రాయై నమః |
ఓం ప్రాణదాయై నమః |
ఓం విమలాయై నమః |
ఓం మహాభూషాయై నమః |
ఓం సర్వభూతహితప్రదాయై నమః | ౭౦
ఓం పద్మాలయాయై నమః |
ఓం సుధాయై నమః |
ఓం స్వాంగాయై నమః |
ఓం పద్మరాగకిరీటినే నమః |
ఓం సర్వపాపవినాశిన్యై నమః |
ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః |
ఓం పద్మగంధిన్యై నమః |
ఓం సర్వవిఘ్నకేశధ్వంసిన్యై నమః |
ఓం హేమమాలిన్యై నమః |
ఓం విశ్వమూర్త్యై నమః | ౮౦
ఓం అగ్నికల్పాయై నమః |
ఓం పుండరీకాక్షిణ్యై నమః |
ఓం మహాశక్త్యై నమః |
ఓం బుద్ధ్యై నమః |
ఓం భూతేశ్వర్యై నమః |
ఓం అదృశ్యాయై నమః |
ఓం శుభేక్షణాయై నమః |
ఓం సర్వధర్మిణ్యై నమః |
ఓం ప్రాణాయై నమః |
ఓం శ్రేష్ఠాయై నమః | ౯౦
ఓం శాంతాయై నమః |
ఓం తత్త్వాయై నమః |
ఓం సర్వజనన్యై నమః |
ఓం సర్వలోకవాసిన్యై నమః |
ఓం కైవల్యరేఖిన్యై నమః |
ఓం భక్తపోషణవినోదిన్యై నమః |
ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః |
ఓం సంహృదానందలహర్యై నమః |
ఓం చతుర్దశాంతకోణస్థాయై నమః | ౧౦౦
ఓం సర్వాత్మాయై నమః |
ఓం సత్యవక్త్రే నమః |
ఓం న్యాయాయై నమః |
ఓం ధనధాన్యనిధ్యై నమః |
ఓం కాయకృత్యై నమః |
ఓం అనంతజిత్యై నమః |
ఓం అనంతగుణరూపే నమః |
ఓం స్థిరేరాజేశ్వర్యై నమః |
శుభమస్తు
సమస్త లోకా సుఖినోభవంతు