అయ్యప్ప స్వామి భక్తులకు రైల్వే శాఖ శుభవార్త
నంద్యాల జిల్లా అయ్యప్ప స్వాములకు రైల్వే శాఖ శుభవార్త
నంద్యాల మీదుగా శబరిమలకు 4 ప్రత్యేక రైళ్ళు
- నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరీ
- నంద్యాల అక్టోబర్ 27 ( రిపబ్లిక్ న్యూస్):
నంద్యాల జిల్లా అయ్యప్ప దీక్ష స్వాములకు కేంద్ర రైల్వే శాఖ శుభ వార్త చెప్పినట్లు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.
ఆదివారం నంద్యాలలో ఎంపీ శబరి మాట్లాడుతూ కేరళ రాష్ట్రం శబరిమల పుణ్యక్షేత్రంకు నంద్యాల ప్రాంతం నుంచి వెళ్లే వేలాది మంది అయ్యప్ప దీక్ష స్వామి భక్తుల సౌకర్యార్థం నంద్యాల మీదుగా 4 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ ను తాను కోరగా ఆయన అంగీకరించినట్లు ఎంపీ శబరి తెలిపారు. శబరిమలలోని అయ్యప్ప స్వామి దర్శనం, ఇరుముడులు సమర్పించేందుకు వెళ్లే నంద్యాల జిల్లా అయ్యప్ప స్వాములను దృష్టిలో పెట్టుకొని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని తాను కోరగా 4 ప్రత్యేక రైళ్ళు నంద్యాల మీదుగా శబరిమలకు నడుపనున్నారని, ఈ స్పెషల్ రైళ్ళు నవంబర్ మొదటి వారం నుంచి నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ అనుమతి ఇచ్చిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.
జిల్లా అయ్యప్ప దీక్ష స్వాములకు కేంద్ర రైల్వే శాఖ శుభ వార్త చెప్పినట్లు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.