ఏపీ వార్షిక బడ్జెట్ లో భారీ నిధులు
AP Budget 2024: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్.. ఆ శాఖకు భారీగా నిధులు!
AP అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు సమావేశాల్లో పూర్తి స్థాయిలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ఇందులో భాగంగా రూ.2,94,427 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో
రెవెన్యూ లోటు 34,743 కోట్లు
ద్రవ్య లోటు 68,742 కోట్లు కాగా
రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు
ఉన్నత విద్య కోసం రూ.2326 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి కోసం రూ.11,490 కోట్లు
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లు
ఆరోగ్యం కోసం రూ.18,421 కోట్లు
జలవనరులు రూ.16,705 కోట్లు
ఇంధనరంగం రూ.8,207 కోట్లు
పోలీస్ శాఖ రూ.8,495 కోట్లు
గృహనిర్మాణం రూ.4,012 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు
బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు
మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు
ఎస్సీ సంక్షేమం కోసం రూ.18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు
అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం రూ.4,376 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలు రూ.11,855 కోట్లు
అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు
వచ్చే మూడేళ్లలో 18 వేల మంది అద్యాపకులకు శిక్షణాభివృద్ది.
పాఠశాల విద్యాశాఖకు రూ.29,909 కోట్లు
192 నేపుణ్య కేంద్రాలు, కళాశాలల ఏర్పాటు
విదేశీ ఉపాధి అవకాశాలు పెంచడమే స్కిల్ ఇంటర్నేషనల్ లక్ష్యం
ఉపాధ్యాయులపై యాప్ భారం తగ్గింపు
స్టేట్ హైవేల కోసం రూ.600 కోట్లు
ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా కోసం 3 శాతం రిజర్వేషన్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.322 కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ. 32,712 కోట్లు
జీఎస్డీపీ రెవెన్యూ లోటు 4.19 శాతం
సంక్రాంతి నాటికి ‘గుంతలు లేని రహదారుల ఆంధ్ర’ మా లక్ష్యం అని అన్నారు.