మందు షాపుల ముందు చూపు అక్రమంగా మద్యం తరలింపు
*ఆఖరి రోజు గ్రామాలకు భారీగా మద్యం తరలింపు*
*వైన్ షాపు సిబ్బంది ముందుచూపుతో బెల్టుసాపులకు ఏకంగా మద్యం సరఫరా*
పాణ్యం సెప్టెంబర్ 30 ( రిపబ్లిక్ న్యూస్)
సెప్టెంబర్ నెల చివరి రోజున ప్రభుత్వ మద్యం దుకాణాలలో మందు లైసెన్సు రద్దవుతుండడంతో వచ్చిన స్టాకును వైన్ షాప్ సిబ్బంది బ్లాక్ లో గ్రామాలకు వందల సంఖ్యలో మందు బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. సోమవారం నెల చివరి రోజున పాణ్యం మండలంలోని వివిధ గ్రామాలకు రూ 150 రూపాయల బాటిల్లు 20 రూపాయలు అదనంగా వసూలు చేసుకుని కేసులు కేసులు బ్లాక్ల్లో తరలిస్తున్నారు. వైన్ షాప్ ముందు నిలబడ్డ మందుబాబులకు మాత్రం 150 రూపాయలు లేవని ఫుల్ బాటిల్ మాత్రమే ఉన్నాయని 200 కు పైగానే మద్యం ఉన్నట్లు చెబుతూ వాళ్ళని నిలువెత్తనముంచుతున్నారు. ఇంత జరుగుతున్న కూడా ఎక్సైజ్ శాఖ సిబ్బంది వారి మామూలు వాళ్లకు వస్తున్నాడంతో నోరు మెదపకుండా తమ వాటాలు కూడా వాళ్లే వసూలు చేస్తారని వారిని విచ్చలవిడిగా మద్యం అక్రమంగా అమ్మమని చెప్పి కళ్ళు మూసుకున్నారు. అక్టోబర్ 1 నుండి కొత్త మద్యం పాలసీ రానున్నందున రేపు మద్యం వస్తుందో రాదోనని అందులో అమావాస్య ఉండడంతో మందుబాబులు తమ పితృదేవతలకు మందు దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందుతూ బ్లాక్లో 200 నుండి 250 వరకు కొనడానికి సిద్ధమవుతున్నారు. మండల కేంద్రానికి చుట్టూ పరిసరాల్లో ఉన్న పల్లెలకు మద్యం షాపులో వెనకవైపు నుండి సిబ్బంది మూటలు గట్టి వాటిని మందుబాబులు ముందే తీసుకొని వెళ్తున్న నోరు మెదపలేని పరిస్థితి మందుబాబులకు ఎదురవుతోంది. ఇప్పటికైనా ఈ అరాచకాన్ని ,అక్రమాలను మందు సొమ్ముతో మీసాలు తిప్పుతున్న వైన్ షాప్ సిబ్బంది, అధికారులకు కళ్లెం వేసేది ఎవరని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు.