రాష్ట్రస్థాయి పోటీలకు కరాటే క్రీడాకారుల ఎంపిక
🥋 🥋🥋🥋🥋🥋🥋🥋
*రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన కరాటే క్రీడాకారులు*
*👉. స్వీయ రక్షణకు విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ అవసరం: డాక్టర్ రవి కృష్ణ
నంద్యాల అక్టోబర్ 1 ( రిపబ్లిక్ న్యూస్):
ఉమ్మడి కర్నూలు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14 అండర్ 17 కరాటే జిల్లా జట్టు ఎంపిక పోటీలలో నంద్యాల కరాటే క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన బోతున్నారు.
కరాటే మాస్టర్ బాలకృష్ణ శిక్షణలో శిక్షణ పొందిన గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన అమీర్ భాష, సెయింట్ జోసెఫ్ బాలికల పాఠశాల కు చెందిన సఖియా,రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి చెందిన ఏడుకొండలు జిల్లా కరాటే జట్టుకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా కళారాధన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు, డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో స్వీయ రక్షణ కోసం విద్యార్థులు ముఖ్యంగా బాలికలు కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం చాలా అవసరం అన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నిజాముద్దీన్, శిరిగిరి రమేష్, కోశాధికారి మామిళ్ల నాగరాజు, కరాటే మాస్టర్ బాలకృష్ణ, కళారాధన కార్యవర్గ సభ్యుడు శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.