విద్యార్థులకు ఉత్తమ విద్యను బోధించి భావితరానికి బాటలు వేయండి

సేవా దృక్పథంతో వరద బాధితులను ఆదుకోండి

  • రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
  • పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, నైపుణ్యతను వెలికి తీయండి
  • జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

 

a26ed540-252d-4715-a52c-9ed63e51edd9

నంద్యాల‌, సెప్టెంబర్ 05 (రిప‌బ్లిక్ న్యూస్‌) : పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉత్తమ విద్యనందిస్తూ వారి భావితరానికి బాటలు వేయాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉపాధ్యాయులను సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా ముఖ్య అతిధులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నారని పిల్లలకు ఉత్తమ విద్యనందిస్తూ వారి భావితరానికి బాటలు వేయాలని టీచర్లకు దిశా నిర్దేశం చేశారు. తాను రాజకీయాల్లో ప్రవేశించడానికి ప్రధాన కారణం గురువులేనని వారికి పాదాభివందన కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా దేశానికి ఎన్నో సేవలందించారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని మంత్రి తెలిపారు.  జిల్లా ప్రజలందరి ఆశీస్సులతో తాను మంత్రిగా, స్పీకర్ గా అనేక పదవులు అలంకరించి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాజకీయాలు మార్చాలన్న ఉపాధ్యాయ చేతుల్లోనే ఉందని మంత్రి సూచించారు.  ప్రస్తుతం రాష్ట్రం భారీ వర్షాలు, వరదల వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం రాత్రింబవళ్లు శ్రమిస్తూ వరద బాధితులను ఆదుకుంటున్నారన్నారు. సేవా దృక్పథంతో బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారని మంత్రి తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ప్రముఖులు, దాతలు ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని పిల్లలకు మంచి విద్యతోపాటు పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, నైపుణ్యతను వెలికితీస్తూ నచ్చిన రంగంలో స్థిరపడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమాజ భవిష్యత్తు అంతా విద్యార్థుల చేతుల్లోనే ఉందని చదువుతోపాటు వినయం, విధేయత, సంస్కారం తదితర సుగుణాల మానవతా విలువలు కూడా నేర్పించాలన్నారు. ఎంపిక చేసిన వారే ఉత్తమ ఉపాధ్యాయులు కాదని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయులేనని ఆమె అభివర్ణిస్తూ వున్న చిన్నపాటి తేడాను సరి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 85% ఉందని తెలిపారని ఈ ఏడాది ఖచ్చితంగా శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. చదువులో వెనుకబడి ఉన్న పిల్లలను గుర్తించి ఇప్పటినుండే చక్కటి విద్యనందించి ఉత్తీర్ణత వంద ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. పిల్లలకు నేర్పే ప్రతి విషయం గురువులు, తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారని భగవద్గీత శ్లోకం ద్వారా స్పష్టంగా వివరిస్తూ ఆకాశాన్ని హద్దుగా చేసుకొని ఏమేర అవకాశం ఉందో ఆ మేర విద్యనభ్యసించేందుకు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇంటర్, డిగ్రీ తర్వాత చాలామంది పిల్లలు చదువు ముగించి సెల్ ఫోన్ కు బానిస కాకుండా ఏదో ఒక రంగంలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నిరుద్యోగం, బాల్యవివాహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వీటిని నియంత్రించేందుకు తల్లిదండ్రులు, యువతలో మార్పులు తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత నిస్తోందని ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ ఉత్తీర్ణత శాతాన్ని, విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచాలన్నారు. తాను కూడా జిల్లా పరిషత్, రెసిడెన్షియల్, ఏపీఆర్జేసీ స్కూళ్లలో చదివే కలెక్టర్ స్థాయికి చేరుకున్నానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యం గల ఉపాధ్యాయులున్నారని  విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఉపాధ్యాయుడు తనదైన శైలిలో పిల్లలకు ఉత్తమ బోధన అందించి పిల్లల్లో వన్నె తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థులు అంకితభావంతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని  కలెక్టర్ హితబోధ చేశారు. శాంతిరాం విద్యాసంస్థల డైరెక్టర్ శివరాం, డీఈవో సుధాకర్ రెడ్డి తదితరులు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అభినందనలు తెలుపుతూ ఉత్తమ బోధనపై సూచనలిచ్చారు. అనంతరం గుర్తించి ఎంపిక చేసిన 59 మంది ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి, జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లాలోని ఉపవిద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి